
తెలంగాణ లో భూకంపం సంభవించింది దాంతో ఇంట్లో ఉన్న జనాలు ఒక్కసారిగా పరుగు అందుకున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ సంచలన సంఘటన తెలంగాణ లోని నిజామాబాద్ లో జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నిజామాబాద్ లో అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూమి లోపలి నుండి భయంకరమైన శబ్దాలు రావడం , భూమి కంపించడంతో నిద్రపోతున్న ప్రజలంతా ఒక్కసారిగా తమతమ ఇళ్ల లోంచి బయటకు వచ్చారు. రోడ్ల మీద నిలబడి ప్రాణాలు దక్కించుకున్నారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.1 గా నమోదైంది.