టీఆర్ఎస్ ఎమ్మెల్సీ , మాజీ మంత్రి ఎల్. రమణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో భాగంగా ఎల్. రమణ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. రమణ తో పాటుగా మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. రమణ రేపు , ఎల్లుండి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈడీ మరికొంతమంది TRS నాయకులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే అందరినీ ఒకేసారి కాకుండా దశల వారీగా పిలవనున్నట్లు సమాచారం.
Breaking News