
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ MLC కవితకు ఎలాంటి నోటీసులు పంపించలేదని కుండబద్దలు కొట్టారు కవిత వర్గీయులు. ఒకవర్గం మీడియాలో ఈరోజు మధ్యాహ్నం నుండి రకరకాల కథనాలు వెలువడ్డాయి. లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని , విచారణ నిమిత్తం ఢిల్లీ రావాలని పేర్కొన్నట్లు కథనం. అలాగే కవిత ఢిల్లీ రావడంతో ప్రశ్నలు వేసి ఆ వెంటనే అరెస్టు చేస్తారని , కవిత అరెస్ట్ ఖాయమంటూ కథనాలు రావడంతో కవిత వర్గీయులు ఈ వార్తలను ఖండించారు. ఈడీ ఎలాంటి నోటీసులను ఇవ్వలేదని పేర్కొన్నారు.