తెలంగాణలో రాబోయే 6 నెలల్లో ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు అందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాగే మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
కేంద్రం ఇస్తున్న నిధుల గురించి పూర్తి వివరాలు చెబుతానని , గతంలోనే చర్చకు రావాలని కేటీఆర్ ను కేసీఆర్ ను కోరానని అయితే తోక ముడుచుకుని పోయి ఇప్పుడు మళ్లీ సవాల్ చేయడం విడ్డురంగా ఉందన్నాడు. ఇప్పటికైనా సరే చర్చకు సిద్ధమా అంటే చెప్పు …… నేను కూడా సిద్ధమే! అయితే ముందుగా రాజీనామా లేఖ పట్టుకొని వస్తే చర్చిద్దామని , నా తప్పు ఉంటె నేను రాజీనామా చేస్తానని , మీది తప్పు ఉంటె అయ్యా కొడుకులు ఇద్దరూ రాజీనామా చేస్తారా ? అంటూ సవాల్ విసిరాడు బండి సంజయ్.