
JSW & JaiSwaraajya యూట్యూబ్ ఛానల్స్ కు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. JSW & JaiSwaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ బృందం మంత్రిని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్న సమయంలో JSW & JaiSwaraajya అధినేతలైన జగదీశ్ యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్బంగా ప్రవాసాంధ్రులు ముఖ్యంగా జగదీశ్ యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ తదితర మిత్ర బృందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. దాంతో ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి.