మాజీ మంత్రి హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య ( 104) అనారోగ్యంతో మృతి చెందారు. వంద సంవత్సరాలు బ్రతకడం ఈరోజుల్లో అరుదు అనే చెప్పాలి. అలాంటిది ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య 104 ఏళ్ళు బ్రతికారు. 104 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించడంతో రాజేందర్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. ఈటల మల్లయ్య మరణించిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు , నాయకులు ఈటల రాజేందర్ కు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.