నిన్నటితో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అయితే సమావేశాల ముగింపు సందర్భంగా సభా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ ప్రస్తావన పదేపదే తెచ్చారు. మా ఈటల …… మన ఈటల అంటూ ఈటల రాజేందర్ పేరును పలుమార్లు ప్రస్తావించారు కేసీఆర్. ఒకప్పుడు ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ కు కుడి చేయిగా ఉండేవారు. కానీ ఈటల రాజేందర్ మీద అనూహ్యంగా కేసీఆర్ కు కోపం రావడంతో పలు ఆరోపణలు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
దాంతో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈటల రాజేందర్. బీజేపీ నుండి పోటీ చేసి సంచలన విజయం సాధించారు. అప్పటి నుండి ఈటల రాజేందర్ పేరు అంటేనే మండిపడే కేసీఆర్ అండ్ కో ఏకంగా ఈటల రాజేందర్ పేరును పదేపదే ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఇక ఇదే అంశంపై విలేకరులతో మాట్లాడిన ఈటల తగిన రీతిలో స్పందించారు. నేను పార్టీ నుండి బయటకు వెళ్ళలేదు. నాపై అవినీతి ఆరోపణలు చేసి , నాపై కేసులు పెట్టి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అప్పుడు నన్ను బీజేపీ అక్కున చేర్చుకుంది. నేను పదేపదే పార్టీలు మారే రకం కాదు…… అయినా కేసీఆర్ నా పేరును పదేపదే ప్రస్తావించడం అంటే నా క్యారెక్టర్ ను మరింత దిగజారి పోయేలా చేయడానికి చేస్తున్న కుట్రలో భాగమే అంతేతప్ప నాపై ప్రేమ కాదన్నారు.