
ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసాడట…… ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదొక సంచలనంగా మారింది. అయితే కేసీఆర్ ఆఫర్ ను మొహమాటం లేకుండా తిరస్కరించాడట ఈటల రాజేందర్. నన్ను ఘోరంగా అవమానించి , మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడమే కాకుండా పార్టీ నుండి వెళ్ళగొట్టారని , అలాంటి పార్టీలోకి మళ్ళీ ఎలా వస్తానని ప్రశ్నించాడట.
అయితే కేసీఆర్ మాత్రం తన పట్టు వదలకుండా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ సొంత ఇమేజ్ తోనే గెలిచారని , అయితే ఇటీవల జరిగిన మునుగోడులో మాత్రం బీజేపీకి భారీ స్థాయిలో ఓట్లు రావడానికి కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ఇమేజ్ తో పాటుగా బీజేపీ కి పెద్ద ఎత్తున పెరుగుతున్న మద్దతు కారణమని భావిస్తున్నారట కేసీఆర్.
అందుకే బీజేపీ ఇంకా ఎదగకముందే ఈటల లాంటి నాయకులతో పాటుగా మరికొంత మంది ప్రజల్లో బలమున్న నాయకులను మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే తప్పకుండా 2023 లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారం చేపడుతుందని భావిస్తున్నారట కేసీఆర్. అందుకే ఈటల రాజేందర్ కు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.