
తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఇది మొదట మాక్ డ్రిల్ అంటూ ప్రచారం చేసారు భద్రతా సిబ్బంది. అయితే ఆ తర్వాత అది అగ్ని ప్రమాదం అని తెలుసుకొని వెంటనే 11 ఫైరింజన్ లను రంగంలోకి దించారు. మొత్తానికి మంటలను ఆర్పేశారు. కొత్త సచివాలయంలో ఎక్కడ మంటలు చెలరేగాయి ….. ఎక్కడెక్కడ నష్టం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
1200 కోట్లకు పైగా ఖర్చుతో తెలంగాణలో కొత్త సచివాలయం కడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆరోజున కొత్త సచివాలయం ప్రారంభించాలని అనుకున్నారు. దాంతో శరవేగంగా సచివాలయం పనులు జరుగుతున్నాయి. వుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.