Kadem Project నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేస్తున్నారు. అయినప్పటికీ వరద పెద్దఎత్తున్న వస్తుండటంతో ప్రాజెక్టుపై నుంచి నీరు వెళ్తున్నది. కడెం జలాశయానికి 3.85 లక్షల క్యూసెక్కుల వరద స్తుండగా, 2.42 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు.
జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, కడెం ప్రాజెక్టుకు వద్దకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇప్పటికే 12 గ్రామాలకు చెందిన సుమారు 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.