హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం శోభాయమానంగా జరుగుతోంది. భారీ ఎత్తున తరలి వచ్చిన గణనాథుని విగ్రహాల ఊరేగింపు చూపరులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ మహానగరం నలువైపుల నుండి పెద్ద ఎత్తున చేరుకున్న గణనాథుల విగ్రహాలకు భారీ స్వాగతం లభించింది. పెద్దే ఎత్తున యువత డ్యాన్స్ లతో , కోలాటాలతో , భాజా బజంత్రీలతో ఊరేగింపుగా వచ్చారు.
ఇక మొజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు మరింత హైలెట్ గా నిలిచాయి. హుస్సేన్ సాగర్ , ఎన్టీఆర్ మార్గ్ , పీవీ మార్గ్ లలో పెద్ద ఎత్తున భారీ క్రేన్ లను ఏర్పాటు చేసి గణనాధులను నిమజ్జనం చేస్టున్నారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.