టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , మంత్రులు చేస్తున్న అరాచకాలను చూసి రక్తం మరిగిపోతోందని , నక్సలైట్లలో చేరి వాళ్ళను చంపాలన్నంత కోపం వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ ఎమ్మెల్యే , మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. తాజాగా కరీంనగర్ కు వచ్చిన గోనె మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఎంపీటీసీలు , సర్పంచ్ లు , ఎమ్మెల్యేలు , మంత్రులు , నాయకులు ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా తెలంగాణ అంతటా అరాచకాలు చేస్తున్నారని , తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని , వాళ్ళ అరాచకాలు చూస్తుంటే నక్సలైట్లు చంపడం ఖాయమని , అది వాళ్లకు పెద్ద పని కాదని …… కేవలం 10 నిమిషాల్లో పని ముగించుకొని వెళ్తారని వ్యాఖ్యానించాడు.
అంతేకాదు కరీంనగర్ లోని ఓ మంత్రి బంధువు ఒక వ్యక్తి 8 కోట్ల ప్రాపర్టీని ఆక్రమించుకున్నాడని , దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ,అలాగే ఈ అవినీతి వ్యవహారం అంతా కేసీఆర్ కు తెలుసనీ అయితే అతడు మాత్రమే ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతేకాదు నేను నక్సలైట్ లలో కలిసి టీఆర్ఎస్ నాయకులను చంపాలన్న కసి ఉందన్నాడు గోనె ప్రకాష్ రావు.