
స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ పోరాట యోధుడు , విద్యావేత్త అయిన డాక్టర్ చుక్కా రామయ్య జన్మదిన వేడుకలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 20 న చుక్కా రామయ్య పుట్టినరోజు కావడం…… పైగా ఈసారి జరిగే పుట్టినరోజు 98 వది కావడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆయన అభిమానులు, శిష్యులు.
విద్యారంగంలో ఎనలేని సేవలు అందించారు చుక్కా రామయ్య. అలాగే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో రెండు పర్యాయాలు కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే ఎమ్మెల్సీ గా కూడా సేవలు అందించారు చుక్కా రామయ్య. దాంతో ఉస్మానియా యూనివర్సిటీ లో రేపు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు.