
అప్పుడే భూమ్మీదికి వచ్చిన ఓ పసికందును ఓ అపార్ట్మెంట్ ఆవరణలో పడేసి వెళ్లిన కసాయి తల్లిదండ్రులు.. గమనించిన అపార్ట్మెంట్ వాసులు పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమై పోలీసులు 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ క్షణాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకున్నారు.
ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చలించిపోయిన ఎస్సై వెంటనే తన చేతుల్లోకి తీసుకుని వైద్యం కోసం ఆసుపత్రికి పరుగులు పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్న ఈ హృదయ విధానకర సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్లో చోటుచేసుకుంది..
స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసిపాపకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.






