HCA లో 40 కోట్ల కుంభకోణం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో కేసీఆర్ ప్రభుత్వం విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 25 న హైదరాబాద్ లో ఆస్ట్రేలియా – భారత్ ల మధ్య మూడో టి 20 మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. దాంతో ఆ మ్యాచ్ ను స్వయంగా చూసేందుకు , తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలని పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలివచ్చారు రెండు తెలుగు రాష్ట్రాలలోని క్రికెట్ అభిమానులు.
అయితే వారం , పది రోజులుగా తిరుగుతున్నప్పటికీ టికెట్ల జాడ లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసారు జనాలు. దాంతో దారిలోకి వచ్చిన HCA ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ) నిన్న ఉదయం అంటే సెప్టెంబర్ 22 న టికెట్లను విక్రయించింది. అయితే కొన్ని టికెట్లు మాత్రమే ఇచ్చి అయిపోయాయి అని చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం 10 వేల టికెట్లు అయినా అమ్మాలి కదా ! స్టేడియం కెపాసిటీ 50 వేలకు మించి ఉంది. స్పాన్సర్ లకు అలాగే ఆటగాళ్ల సంబంధీకులకు , ఇతర ముఖ్య అధికారులకు కొన్ని పోయినా దాదాపు 35 వేల టికెట్లు ఉంటాయి. మరి వాటిని మొత్తం బ్లాక్ చేసి అమ్ముకున్నారని అందుకే తక్కువ టికెట్లు ఇచ్చి అభిమానుల హృదయాలను గాయపరిచాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు పలువురు. మొత్తంగా ఇది 40 కోట్ల కుంభకోణం అని ఆరోపణలు రావడంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అజారుద్దీన్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వనున్నాడు.