క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో 40 కోట్ల అవినీతి జరిగిందనే వార్తలను కొట్టిపడేసాడు HCA అధ్యక్షుడు అజారుద్దీన్. ఆన్ లైన్ టికెట్లన్నీ పేటీఎం ద్వారానే అమ్ముతున్నామని , కొంతమంది ఎక్కువ బుక్ చేసుకుంటే అది మాదా తప్పు ….. అలా చేసుకుంటే అవినీతి జరిగినట్లేనా ? అంటూ ప్రశ్నించాడు అజారుద్దీన్. HCA ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ) మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో ఈరోజు మీడియా ముందుకు వచ్చాడు అజారుద్దీన్.
క్రికెట్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూడాలని భావించిన వేలాదిమంది యువతీయువకులు రోజుల తరబడి క్యూలో నిలబడ్డారు. తీరా సమయానికి 2000 టికెట్స్ కూడా ఇవ్వకుండానే అన్ని టికెట్లు అయిపోయాయని HCA ప్రకటించడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. ఇక ఈ విషయం మీద బీసీసీఐ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.