
హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ అంతటా అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది.