భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈరోజు హీరో నితిన్ సమావేశం కానున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 30 నిమిషాల పాటు పలు అంశాలపై ఎన్టీఆర్ – అమిత్ షా చర్చించారు దాంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది.
కట్ చేస్తే ఇప్పుడేమో ఆగస్టు 27 న జేపీ నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఈరోజు హన్మకొండలో ఈరోజు బీజేపీ భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తోంది. ఆ సమావేశంలో పాల్గొన్న అనంతరం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో హీరో నితిన్ తో పాటుగా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో 2023 లో ఎన్నికలు రావాలి. అయితే ఈలోపే ఎన్నికలు రావచ్చని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎలాగూ మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై పూర్తిగా దృష్టి పెట్టింది. దాంతో పలువురు సినీ ప్రముఖులను అలాగే ఇతర ప్రముఖులను తమకు మద్దతుగా నిలిచే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు.
Breaking News