
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈరోజు నుండి ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. అయితే భైంసాలో ఈ పాదయాత్ర కావడంతో ఆ ప్రాంతం చాలా సెన్సిటివ్ కావడంతో పోలీసులు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. అకస్మాత్తుగా పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ.
దాంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు పలు షరతులు విధిస్తూ బండి సంజయ్ కు అనుమతులు ఇచ్చింది. భైంసా పట్టణంలోని పాదయాత్ర చేరుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అంతేకాదు బహిరంగ సభ కూడా భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని సూచించింది.