ఫిబ్రవరి 17 న తాతయ్య కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా తాత కోసం గోల్డెన్ అవర్ పాట పాడి తాతపై తనకున్న ప్రేమను , అభిమానాన్ని చాటుకున్నాడు కల్వకుంట్ల హిమాన్షు రావు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తండ్రి కల్వకుంట్ల తారకరామారావు చాలా సంతోష పడుతున్నాడు.
నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ కొడుకు పాడిన పాటను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఇక మేనత్త ఎమ్మెల్సీ కవిత కూడా మేనల్లుడు పాట బాగుందని మెచ్చుకుంది. హిమాన్షు రావు పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సింగర్ గా మంచి భవిష్యత్ ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Super proud and excited for my son @TheRealHimanshu 😊
I loved it; Hope you all do too ❤️ https://t.co/obmjzwE9SK
— KTR (@KTRBRS) February 17, 2023