Happy Holi :
తెలంగాణలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోలీ వేడుకలను రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు , యువతీయువకులు , పిల్లలు , మహిళలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు సంతోషంగా రంగులు పూసుకున్నారు. ఇక పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రకరకాల రంగులతో పాటుగా రంగు నీళ్లతో హోలీ పండుగను జరుపుకున్నారు. హోలీ వేడుకలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి.
యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొని డీజే సౌండ్ లతో హోరెత్తించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. స్నేహం ముందు చిన్నా పెద్దా …… ఆస్తులు , అంతస్థుల తేడా లేకుండా….. రాకుండా పండుగ సంబరాల్లో మునిగారు. అయితే రంగులు పూసుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్త సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి. అయితే అవి పెద్దవి కాకుండా పక్కనున్న వాళ్ళు సర్దుబాటు చేయడం విశేషం. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు హొలీ వేడుకల్లో నిమగ్నమయ్యారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం అందరికీ భిన్నంగా తన కొత్త సినిమా లాల్ సలామ్ చిత్రాన్ని ప్రారంభించి ఆ వేడుకలో హోలీ వేడుకలు చేసుకోవడం విశేషం.
#LalSalaam Shoot Begins Today!!! pic.twitter.com/KtfMO3ruf0
— Christopher Kanagaraj (@Chrissuccess) March 7, 2023