ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఖమ్మం ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈరోజు హైదరాబాద్ నుండి ఖమ్మం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించారు చంద్రబాబు. ఖమ్మంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని నిర్వహించగా ఆ సమావేశానికి హాజరయ్యారు బాబు.
ఇక చంద్రబాబు పర్యటనకు అద్భుత స్పందన వచ్చింది. సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించడంతో దారిపొడవునా టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మధ్య మధ్యలో ఆగుతూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళింది బాబు కాన్వాయ్.
అలాగే ఖమ్మం పట్టణం పసుపు మయం అయ్యింది. మేళతాళాలతో కార్యకర్తలు బాబుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. పూర్వపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రం విడిపోయాక మాత్రం టీడీపీ తెలంగాణలో చాలా బలహీన పడింది. 2014 లో టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకోగా తెలుగుదేశం పార్టీ 15 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించగా బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2018 లో మాత్రం మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ లతో కలిసి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీకి 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆ రెండు కూడా ఖమ్మం జిల్లాలోనివి కావడం విశేషం. దాంతో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటాలని భావిస్తోంది టీడీపీ. అందుకే ఖమ్మంపై గురి పెట్టింది.