అమెరికా కాన్సులేట్ జనరల్ కొత్త కార్యాలయం అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ఈనెల 20 న హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో అమెరికా కాన్సులేట్ జనరల్ కొత్త కార్యాలయం ప్రారంభం కానుంది. ఇన్నాళ్ళుగా బేగం పేటలోని పైఘా ప్యాలెస్ లో ఈ కాన్సులేట్ కార్యాలయం ఉండేది. అమెరికా పాస్ పోర్ట్ సేవలన్నీ అక్కడి నుండే నిర్వహించేది.
అయితే నానక్ రాం గూడ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కొత్త కార్యాలయాన్ని 340 మిళియన్లతో అత్యంత ఆధునికంగా నిర్మించారు. మార్చి 15 వరకు కూడా బేగం పేట లోని కార్యాలయం సేవలు అందించనుంది. అయితే 16 నుండి 20 వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు. ఎందుకంటే మార్చి 20 న కొత్త కాన్సులేట్ ప్రారంభోత్సవం ఉంటుంది కాబట్టి. ఈలోపు ఎమెర్జెన్సీ ఉంటే +91 040 4033 8300 కు కాల్ చేసి సేవలు పొందచ్చు. అలాగే [email protected] కు మెయిల్ చేసి సేవలు పొందవచ్చని పేర్కొంది కాన్సులేట్ కార్యాలయం.