గత అయిదేళ్ల కాలంలో ఖరీదైన కార్లను సొంతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎంత ఖరీదైన కారు ఉంటే అంత గౌరవం , హోదా అని ఫీలయ్యేవాళ్ళు కోకొల్లలుగా తయారయ్యారు సంపన్నులు. తాజాగా హైదరాబాద్ కు చెందిన నజీర్ ఖాన్ అనే వ్యాపారవేత్త ” మెక్ లారెన్ ” అనే ఖరీదైన కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారు ఖరీదు ఎంతో తెలుసా …… అక్షరాలా 12 కోట్లు.
ఇంతటి ఖరీదు గల కారు భారత్ లో మొట్టమొదటిది ఇదే కావడం విశేషం. ఇండియాలోనే ఖరీదైన మొట్టమొదటి కారు హైదరాబాదీ సొంతం చేసుకోవడం సంచలనంగా మారింది. ” మెక్ లారెన్ ” 765 LT కారు ఇప్పుడు భారత్ లో సూపర్ కార్ గా తయారయ్యింది. ఈ కారును సొంతం చేసుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. అయితే మొదటి కారును హైదరాబాదీ నజీర్ ఖాన్ సొంతం చేసుకోవడంతో అతడి అదృష్టానికి పొంగిపోతున్నారు…….. అలాగే అసూయ పడుతున్నారు కూడా.