అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన సదస్సు జరిగింది. ఫిబ్రవరి 4 క్యాన్సర్ డే కావడంతో ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. క్యాన్సర్ పట్ల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించాలనే గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి ముఖ్యంగా మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు …… వస్తే ఎలాంటి చికిత్సలు ఉన్నాయనే విషయాన్ని సవివరంగా వివరించారు. అలాగే విశిష్ట అతిథిగా హాజరైన డాక్టర్ జై యలమంచిలిపై ప్రశంసల వర్షం కురిపించారు ఎమ్మెల్యే గువ్వల. రక్తదాతల , రక్త గ్రహీతల సమగ్ర సమాచారంతో UBlood app వంటి మహోన్నత యాప్ ను ప్రజల కోసం ఏర్పాటు చేసినందుకు డాక్టర్ జై యలమంచిలిని అభినందించారు. అంతేకాదు మావంతు ప్రచారం చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. UBlood app సృష్టికర్త డాక్టర్ జై యలమంచిలి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అలాగే గువ్వల బాలరాజు ఫౌండేషన్ చైర్మన్ గువ్వల అమలకు కృతజ్ఞతలు తెలిపారు.
క్యాన్సర్ అవగాహన సదస్సు ను భారీ స్థాయిలో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుబ్లడ్ యాప్ విశిష్టత తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ , GBR ఫౌండేషన్ చైర్మన్ గువ్వల అమల , అంకుర్ హాస్పిటల్స్ ప్రతినిధి , UBlood app ప్రతినిధి బృందం, BRS రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు , మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.