తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎన్నికలకు ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కానున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈనెల 17 న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జాతకాలపై విపరీతమైన నమ్మకం ఉందన్న విషయం తెలిసిందే. దాంతో కొత్త సచివాలయం కడితేనే కేటీఆర్ కు ముఖ్యమంత్రి హోదా దక్కుతుందనే నమ్మకాన్ని నిజం చేస్తూ ఆఘమేఘాల మీద కొత్త సచివాలయం పూర్తి చేసారు.
ఇంకా కొన్ని పనులు ఉన్నప్పటికీ ఫిబ్రవరి 17 న కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సచివాలయం ప్రారంభించిన తర్వాత బహుశా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అప్పగించి కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించనున్నాడని సమాచారం.