
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీలో కలిసాడు దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం చెలరేగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి గతకొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి మీద అవకాశం దొరికిన ప్రతీ సారి విరుచుకు పడుతూనే ఉన్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే …… అదే సమయంలో జగ్గారెడ్డి కేసీఆర్ ను కలవడం కలవరం సృష్టించింది.
అయితే ఈ కలయిక కేవలం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమేనని …… నన్ను సోషల్ మీడియాలో చాలా ఇబ్బంది పెడుతున్నారని అలాంటి వాళ్ళ వల్ల నాకు ఎలాంటి నష్టం లేదని , వాటి గురించి పట్టించుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టాడు జగ్గారెడ్డి. గతంలో జగ్గారెడ్డి కేసీఆర్ నాయకత్వంలో పని చేసిన విషయం తెలిసిందే. మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యింది TRS టికెట్ మీదే.