
కాంగ్రెస్ – బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ పొత్తును ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు. తెలంగాణలో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగాలా ఉన్నాయి.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. రాష్ట్ర నాయకత్వంలో రేవంత్ రెడ్డి తో పాటుగా చాలామంది నాయకులు కేసీఆర్ ను గద్దె దించాలని చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది నాయకులు మాత్రం కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజయోగం దక్కడం ఖాయమని భావిస్తున్నారు. అందుకే పొత్తు కోసం తహతహలాడుతున్నారు.
జాతీయ స్థాయిలో మోడీని గద్దె దించాలంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో తెలంగాణలో మాత్రం కేసీఆర్ తో పొత్తు వద్దనేదే వాళ్ళ ఆలోచన కానీ తెలంగాణలోని కొంతమంది నాయకుల ఆలోచన మాత్రం కేసీఆర్ తో పొత్తు ఉంటే ఉభయకుశలోపరి అని అంటున్నారు.
ఇక కేసీఆర్ కూడా మళ్ళీ అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాడా ? పొత్తు పెట్టకుంటాడా ? ఈ రకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో జానారెడ్డి కాంగ్రెస్ – బీఆర్ఎస్ పొత్తుల గురించి వ్యాఖ్యానించి అగ్గి రాజేసాడు.






