
జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్నను దర్శించుకున్న విషయం తెలిసిందే. తన వాహనం వారాహికి కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించాడు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్న, బ్రాహ్మణుల ఆశీర్వాదం అందుకున్న తర్వాత మీడియాతో ముచ్చటించాడు జన సేనాని.
తెలంగాణలో 7 నుండి 14 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామని స్పష్టం చేశాడు. బీజేపీ నా మిత్రపక్షం అందులో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్ లో పొత్తులు కుదిరితే ఏపీలో పొత్తులు పెట్టుకుంటామని …… అక్కడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నాలు చేస్తున్నామని అయితే పొత్తు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశాడు. ఏపీ సంగతి బాగానే ఉంది కానీ తెలంగాణలో బీజేపీ మిత్ర పక్షం అంటూనే 7 నుండి 14 స్థానాలకు పోటీ చేస్తామని అనడమే విచిత్రంగా ఉంది ఎందుకంటే తెలంగాణలో ఉన్నదే 17 పార్లమెంట్ స్థానాలు. అందులో 7 నుండి 14 స్థానాల్లో జనసేన పోటీ చేయడం అంటే మాటలు కాదు……. బీజేపీ – జనసేన ల మధ్య మంటలే.