నటి , దర్శకురాలు జీవిత ఎమ్మెల్సీ కవిత పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పై పలు ఆరోపణలు వస్తున్నాయని , ఒకవేళ ఆ స్కామ్ తో సంబంధం లేదని అనుకుంటే దర్యాప్తు సంస్థల ముందుకు వచ్చి మీ నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేసింది జీవిత.
కవితకు ఉద్యమ సమయంలో ఉన్న ఆస్తులు ఎన్ని , ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయంటూ నిలదీసింది జీవిత. అలాగే హైదరాబాద్ లోని పబ్ , క్లబ్ లలో కేటీఆర్ లకు వాటాలు ఉన్నట్లుగా ఆయా సంస్థల యజమానులు నాతో చెప్పారని అహంకారంతో విర్రవీగుతున్న టీఆర్ఎస్ కు మునుగోడులో తప్పకుండా పరాజయం ఎదురు అవుతుందని తేల్చి చెప్పింది జీవిత.
గతంలో పలు పార్టీలలో చేరి కొన్నాళ్ల పాటు మాత్రమే ఉంటూ ఆ తర్వాత ఆ పార్టీలకు రాజీనామా చేయడం , మరో పార్టీలో చేరడం కామన్ అయిపొయింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు జీవిత ,రాజశేఖర్.
Breaking News