తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ పార్టీకి కర్ణాటకలో అండగా ఉండనున్నారు సినీ నటులు ప్రకాష్ రాజ్. గతంలో ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ గా పార్లమెంట్ కు పోటీ చేశారు. అయితే ఓటమి చెందినప్పటికీ ఎక్కడా తగ్గడమే లేదు ప్రకాష్ రాజ్.
అయితే కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ దేశ వ్యాప్తంగా పలువురు స్థానిక నాయకుల మద్దతు కావాలి . ప్రజల్లో పట్టు ఉన్న నాయకులు పార్టీలో చేరాలి అప్పుడే కేసీఆర్ పార్టీకి బలం చేకూరుతుంది. అందుకే కర్ణాటక బాధ్యతలు ప్రకాష్ రాజ్ కు అప్పగించనున్నట్లు సమాచారం. మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రకాష్ రాజ్.
దాంతో కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ కు స్నేహం ఏర్పడింది. కేసీఆర్ ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన సమయంలో కూడా ప్రకాష్ రాజ్ కీలకంగా వ్యవహరించారు. అయితే కేసీఆర్ కు కర్ణాటకలో మరో ఇబ్బంది కూడా ఉంది. అది ఏంటంటే …… జేడీఎస్. మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి లు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. అలాంటి చోట ప్రకాష్ రాజ్ రూపంలో ప్రత్యామ్నాయంగా ఎదిగితే వాళ్ళు సహిస్తారా ? అన్నది చూడాలి.