కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కి ఝలక్ ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత. ఈనెల 6 న నేను సీబీఐ కి అందుబాటులో ఉండటం లేదని, దానికి బదులుగా ఈనెల 11, 12 , 14 , 15 తేదీలలో ఏదో ఒక రోజు ఎంచుకోవాలని అలాగే ఈ విషయాన్ని త్వరగా నిర్ణయించాలని సీబీఐ ని కోరింది కవిత.
తాజాగా సీబీఐ కు మరో లేఖ రాసింది కవిత. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన అనంతరం కవిత తన నిర్ణయాన్ని మార్చుకుంది. మొదట ఈనెల 6 న సీబీఐ తన ఇంటికి రావాలని అక్కడే వివరణ ఇస్తానని స్పష్టం చేసింది కవిత.
అయితే ఆ తర్వాత FIR లో నాపేరు లేదు కాబట్టి , అలాగే ముందుగానే నాకు కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ అయి ఉన్నందున రేపు సీబీఐ కి అందుబాటులో ఉండనని, అందుకు బదులుగా ఈనెల 11, 12 , 14 , 15 తేదీలలో ఒకరోజు ఎంచుకుంటే ఆ రోజు నా ఇంటికి రండి……. ఇంట్లోనే మీకు కావాల్సిన వివరణ ఇస్తానని స్పష్టం చేసింది. నాకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని , విచారణకు తప్పకుండా సహకరిస్తానని లేఖలో పేర్కొంది కవిత. అయితే ఈ లేఖ వల్ల సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.