ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా సీబీఐకి లేఖ రాసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించిన ఫిర్యాదుతో పాటుగా ఎఫ్ ఐ ఆర్ కాపీలను కూడా అందించాలని , అలాగే ఇతర డాక్యుమెంట్లు కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరింది. ఆ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత మాత్రమే నేను వివరణ ఇచ్చే తేదీని ఖరారు చేయాలని కూడా కోరింది కవిత. ఆమేరకు సీబీఐ అధికారి అలోక్ కుమార్ ను కోరింది కవిత. మరి కవిత లేఖ పై సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. మాములుగా అయితే డిసెంబర్ 6 న కవితను విచారణ చేస్తామని ప్రకటించింది సీబీఐ. కవిత లేఖ వల్ల ఏమైనా మార్పులు జరుగుతాయా చూడాలి.
Breaking News