
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. మొత్తం 9 గంటలకు పైగా ఈడీ విచారణ సాగింది. ఉదయం 11 గంటలకు తుగ్లక్ రోడ్డు లోని కేసీఆర్ అధికారిక నివాసం నుండి ఈడీ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఉదయం నుండి రాత్రి 8 గంటల వరకు మొత్తంగా 9 గంటల విచారణ సాగింది. కవితను ఎక్కువసేపు విచారించడంతో అరెస్ట్ చేసారా ? అనే టెన్షన్ నెలకొంది. అయితే కవిత విచారణ మొదటి రోజు పూర్తయ్యింది అని ముందుగానే సమాచారం అందించడంతో కవిత బయటకు రావడం ఖాయమని అంతా ఊపిరి పీల్చుకున్నారు కార్యకర్తలు…… అభిమానులు. 9 గంటల విచారణ తర్వాత కవిత తన వాహనంలో ఇంటికి చేరుకుంది. అయితే కవితను మళ్లీ ఈనెల 16 న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కోరినట్లు సమాచారం.