తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని గతకొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఊహాగానాలను కొట్టి పడేసాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన భారత్ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. సర్వేలన్ని మనకే అనుకూలంగా ఉన్నాయి. ఇక ముందస్తు ఎన్నికలు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మనం ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉందని, ఈలోపు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.
త్వరలోనే వరంగల్ లో భారీ ఎత్తున భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాలను జరుపనున్నామని అందుకు పార్టీ నాయకులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళిత బంధు లక్షా 30 వేలమందికి ఇవ్వనున్నామని, అలాగే గొర్రెల పంపిణీ కార్యక్రమం , 4 లక్షల మందికి గృహాలక్ష్మి పథకం కింద 3 లక్షల చొప్పున ఇవ్వనున్నామని ఇవన్నీ జయప్రదం అయ్యేలా చేయాలని మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను కేసీఆర్ కోరారు . అయితే కేసీఆర్ గతంలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదంటూనే ఎన్నికలకు వెళ్లారు. దాంతో కేసీఆర్ మాటలను ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ముందస్తు ఎన్నికలు తధ్యమని అంటున్నారు.