
ఢిల్లీ పర్యటన ముగించుకొని హైద్రాబాద్ బయలుదేరారు తెలంగాణ ముఖ్యమంత్రి , భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్. నాలుగు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు కేసీఆర్.
ఈరోజు భారత్ రాష్ట్ర సమితి కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ కార్యాలయం మొత్తాన్ని కలియతిరిగి ఎక్కడ ఎలాంటి మార్పులు చేయాలో వివరించాడు. అలాగే తనని కలవడానికి వచ్చిన కార్యకర్తలను అందరినీ కలిశాడు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పార్లమెంట్ సభ్యులను , నాయకులను కలిసి భారత్ రాష్ట్ర సమితి విధి విధానాలను చర్చించారు. రైతు అజెండా లక్ష్యంగా తమ విధానాలు ఉంటాయని స్పష్టం చేసాడు కేసీఆర్.