తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కైకాల సత్యనారాయణ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు. ఈరోజు తెల్లవారు జామున నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దాంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు కైకాల మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కు కైకాల మరణించారన్న విషయం తెలియడంతో కైకాల నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్ , మాగంటి గోపీనాథ్ , ఎమ్మెల్సీలు పళ్లా రాజేశ్వర్ రెడ్డి , సిరికొండ మధుసూధనా చారి, నాయకులు వేణుగోపాల చారి, దాసోజు శ్రవణ్ తదితరులు ఉన్నారు.