తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 30 సంవత్సరాల క్రితం కేసీఆర్ తన కుటుంబంతో కలిసి కొండగట్టు అంజన్న ( ఆంజనేయ స్వామి ) గుడికి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటోలను తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలను ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేసాడో తెలుసా…….. నిన్నటి రోజున కొండగట్టును దర్శించుకున్నాడు కేసీఆర్. ఒకప్పుడు ఎమ్మెల్యే గా కొండగట్టుకు వెళితే …… నిన్న మాత్రం ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు. అంతేకాదు కొండగట్టు గుడిని 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాడు.
30 సంవత్సరాల క్రితం తన పెద్దనాన్న కేసీఆర్ తో తాను వెళ్లిన కొండగట్టు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పటి రోజులను జ్ఞాపకం చేసుకున్నాడు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్. ఈ ఫోటోలలో తన తల్లిదండ్రులు , పెద్దమ్మ శోభ , పెద్ద నాన్న కేసీఆర్ లతో పాటుగా కవిత కూడా ఉందని తెలిపాడు సంతోష్ కుమార్. కొండగట్టు అభివృద్ధి కోసం ఇన్నాళ్లు పట్టించుకోక పోయినా ఇప్పుడు దృష్టి పెట్టడంతో కొండగట్టు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Now it’s #Kondagattu’s turn for its overal facelift by developing another landmark mythological structure. #Throwback pics from the view point place, when we had numerous Darshans of Kondagattu Anajanna along with our Hon’ble CM Sri KCR garu and family. pic.twitter.com/Rz31qoggA1
— Santosh Kumar J (@MPsantoshtrs) February 15, 2023