తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారయ్యింది. గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే గవర్నర్ తమిళ సై కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఆరోపణలు , ప్రత్యారోపణలతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక ఫిబ్రవరిలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకు గవర్నర్ అనుమతి ఉండాలి….. కానీ ఇంతవరకు కూడా గవర్నర్ నుండి అనుమతి లభించకపోవడంతో తెలంగాణ సర్కారు కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమైంది.
ఇందుకోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ ను నియమించుకుంది తెలంగాణ ప్రభుత్వం. కోర్టు ఆదేశాలతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ఎలా నిర్వహిస్తారని గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా కేసీఆర్ సర్కారు మాత్రం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించాలని పట్టుదలతో ఉంది కేసీఆర్ సర్కారు.