గవర్నర్ తమిళిసై తో నువ్వా – నేనా అన్నట్లుగా సాగిన వివాదం కీలక మలుపు తిరిగింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని పట్టుదలతో ఉంది కేసీఆర్ సర్కారు. అయితే గవర్నర్ అసెంబ్లీ సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది కేసీఆర్ ప్రభుత్వం. ఏకంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దువే ను పిలిపించారు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తూ.
హైకోర్టు లో వాదనలు వినిపించారు కూడా ….. అయితే తదుపరి విచారణకు మధ్యాహ్నం కు వాయిదా వేసింది. ఇంకేముంది మధ్యాహ్నం మరింత రసవత్తరంగా సాగడం ఖాయమని అనుకున్నారు అందరూ. కట్ చేస్తే అనూహ్య నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కారు. గవర్నర్ పై ఫిర్యాదు చేస్తూ కోర్టుకెక్కిన కేసీఆర్ ప్రభుత్వం పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంది. అంతేకాదు గవర్నర్ ప్రసంగంతోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దాంతో కేసీఆర్ నిర్ణయం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతోటి దానికి కోర్టుకు ఎక్కడం ఎందుకు ? వెనకడుగు వేయడం ఎందుకు ? అనే చర్చ మొదలైంది.