
తెలంగాణ ఐటీ , పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇటీవల తనని కలిసిన అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరాడు. ఆమధ్య కాలుకు గాయం కావడంతో మూడు వారాల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు.
ఆ గాయం నుండి కోలుకొని ఇటీవలే వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇంకేముంది దాంతో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి , చికిత్స తీసుకుంటున్నాడు. గతంలో కూడా కేటీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.