
ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో గులాబీ దళం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. బొగ్గు గనులను ప్రయివేటుపరం చేయమని ప్రధాని అన్నారు కానీ తెలంగాణలో బొగ్గు గనులను ప్రయివేటు పరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్. అందుకే BRS తరుపున పెద్ద ఎత్తున బొగ్గు గనుల ప్రాంతాల్లో ప్రధానికి నిరసన తెలపాలని పిలుపునిచ్చాడు కేటీఆర్.
దాంతో బొగ్గు గనుల ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు , ముఖ్య కార్యకర్తలు , బొగ్గు గనుల కార్మికులతో కలిసి ధర్నాలు , రాస్తారోకోలు నిర్వహించనున్నారు. మోడీకి తమ నిరసన తెలిపేలా భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు గులాబీ దళం. బొగ్గు గనుల ప్రాంతాల్లో మాత్రమే కాదు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నిరసనలకు దిగనున్నారు. దాంతో రేపటి ప్రధాని పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.






