
ఎట్టకేలకు బాసర IIIT ని సందర్శించారు తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్. గతకొంత కాలంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, లేదంటే మంత్రి కేటీఆర్ బాసరకు రావాలని , సమస్యలు వినాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ డిమాండ్ నెరవేరింది. కేటీఆర్ ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీ కు వెళ్లారు. స్టూడెంట్స్ సమస్యలను విన్నారు….. అంతేకాదు కొన్ని హామీలు ఇచ్చారు. దాంతో స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలను తక్షణం అమల్లోకి తీసుకు రావాలని కోరుతున్నారు. మొత్తానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.