తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో పాదయాత్ర సాగుతోంది. ఆ సందర్బంగా కోరుట్ల నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన 40 మంది నేతలు , కార్యకర్తలు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వాళ్లకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. యూసుఫ్ నగర్ గ్రామ సర్పంచ్ తుకారాం గౌడ్ నేతృత్వంలో పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఈనెల 15 న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5 వ విడత ముగింపు సభ సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నాడు.
Breaking News