సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తెలంగాణలో పోటీ చేయనున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గల్లా జయదేవ్ కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుండో ఉంది. అయితే గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. 2014 లో అలాగే 2019 లో కూడా గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. కానీ ఈసారి జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం లోని మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం వల్ల అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నామరూపాల్లేకుండా పోయింది. అయినప్పటికీ 2014 మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంతో పాటుగా 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. అయితే మెల్లిమెల్లిగా టీడీపీ కి చెందిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2 అసెంబ్లీ స్థానాలను గెల్చుకోవడం విశేషం. ఇక ఇప్పుడేమో కేసీఆర్ సర్కారు తెరాస ను కాస్త భారస గా మార్చాడు. దాంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా గల్లా జయదేవ్ ను మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయించాలని భావిస్తోందట. అలాగే గల్లా జయదేవ్ కూడా ఎక్కువగా ఉండేది హైదరాబాద్ లోనే కావడంతో పాటుగా భారీగా పెట్టుబడులు పెడుతోంది తెలంగాణలోనే. దాంతో మల్కాజ్ గిరి పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.