తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త లీడర్ వచ్చాడు. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ గా ఇన్నాళ్లు వ్యవహరించిన మాణిక్కం ఠాగూర్ ను గోవా ఇంచార్జ్ గా పంపించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక తెలంగాణ కు కొత్త లీడర్ ను మహారాష్ట్ర నుండి తెచ్చిపెట్టింది. మహారాష్ట్ర కు చెందిన సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ను నియమించింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్ధం కాక తలపట్టుకుంటున్నారు.
ఇటీవల జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. రేవంత్ రెడ్డి వర్గానికి మాణిక్కం ఠాగూర్ వంత పాడుతున్నారని సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి దిగ్విజయ్ సింగ్ ను పంపించింది కాంగ్రెస్ అధిష్టానం. రెండు రోజుల పాటు కాంగ్రెస్ నాయకుల, ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన డిగ్గీ రాజా తన నివేదికను అధిష్టానానికి అందించాడు.
దాంతో డిగ్గీ రాజా నివేదికతో కాంగ్రెస్ సీనియర్లను సంతృప్తి పరచటానికి మాణిక్కం ఠాగూర్ ను గోవాకు పంపించి మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ను తెలంగాణ ఇంచార్జ్ గా నియమించింది. దాంతో మరో రెండు రోజుల్లోనే కాంగ్రెస్ నాయకులతో కొత్త ఇంచార్జ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.