అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాడు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కు పంపించాడు. చాలా బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించాడు శశిధర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న శశిధర్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నాడు.
కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని ఇటీవల ఢిల్లీలో వ్యాఖ్యానించాడు మర్రి శశిధర్ రెడ్డి దాంతో ఆగ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఆరేళ్ళ పాటు పార్టీ నుండి బహిష్కరించింది. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్రి శశిధర్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. దాంతో ఈనెల 25 లేదా 26 న కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని భావిస్తున్నారు.