
కవిత అంటే పద్యం అనుకుంటివా ? కాదు మద్యం అంటూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలు అంటూ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
రేపు ఢిల్లీలో ఈడీ కవితను ప్రశ్నించనుంది. అలాగే ప్రశ్నల తర్వాత కవిత ను అరెస్ట్ చేయడం ఖాయమని వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కవిత ట్విట్టర్ లో తెలంగాణ తల వంచదు అంటూ ట్వీట్ చేసి దుమారం రేపింది. తెలంగాణ సెంటిమెంట్ వస్తుందని అనుకున్నారు . అయితే అందుకు బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో నువ్వు అవినీతికి పాల్పడితే దానికి తెలంగాణ సెంటిమెంట్ తో సంబంధం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో అయితే ఇలాంటి మీమ్స్ బోలెడు వైరల్ అవుతున్నాయి. అన్ని మీమ్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రంలోని డైలాగ్ ను మార్చేసి ” కవిత అంటే పద్యం అనుకుంటివా ? కాదు మద్యం ” అంటూ కలరిచ్చారు. ఇంకేముంది ఈ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.