
పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ….. మేము కూడా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని అందుకు బీజేపీ సిద్ధమా ? అంటూ సవాల్ విసిరాడు తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించాడు కేటీఆర్. ఆ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోడీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
పదేపదే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని , అయితే మాకు మాత్రం ముందస్తు వెళ్లే ఆలోచన లేదని …… ఒకవేళ మోడీ పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే మేము కూడా అందుకు సిద్దమే అని సవాల్ చేసాడు. అంతేకాదు 14 మంది ప్రధానులు 56 వేల లక్షల కోట్ల అప్పులు చేస్తే మోడీ ఒక్కడే 100 లక్షల కోట్ల అప్పు చేసాడని , ఆ అప్పు ఎక్కడ పెట్టాడని విమర్శించాడు కేటీఆర్.