
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ కు చెందిన వెంకటయ్య – శకుంతల దంపతులు కొన్నాళ్ల క్రితం మేడ్చల్ జిల్లా లోని పీర్జాదిగూడలో నివాసం ఉంటున్నారు. వెంకటయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వెంకటయ్య – శకుంతల దంపతులకు మొత్తం అయిదుగురు సంతానం కాగా అందులో ముగ్గురు ఎదిగిన ఆడపిల్లలు ప్రేమలత (31 ), స్వర్ణలత (29) , మనీష ( 22 ) ” మస్క్యులర్ డిస్ట్రోపి ” అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు కండరాల బలహీనత వల్ల తమ పనులను తాము చేసుకోలేరు.
ఎదిగినఆడ పిల్లలను వెంకటయ్య – శకుంతల చూసుకోవడం అలాగే వాళ్ళను పోషించడం కష్టంగా మారింది. దాంతో ఈ విషయాన్ని తెలుసుకున్న JSW & Jaiswaraajya.tv బృందం వాళ్ళ కష్టాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించింది. వెంకటయ్య కుటుంబ కష్టాలను మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన కేటీఆర్ పీర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి తనతో బాధిత కుటుంబాన్ని మాట్లాడించాలని కోరడంతో హుటాహుటిన వెంకటయ్య ఇంటికి చేరుకున్నాడు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడమే కాకుండా తక్షణ సాయంగా లక్ష రూపాయల చెక్కు అందించారు మేయర్ వెంకట్ రెడ్డి.

అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సంబంధిత వైద్యులను వెంకటయ్య ఇంటికి పంపించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరంగా తగిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేసారు మంత్రి కేటీఆర్. తమ ధీనస్థితిని వెలుగులోకి తెచ్చి మంత్రి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా JSW & Jaiswaraajya.tv సంస్థల అడ్వైజర్ డాక్టర్ జై యలమంచిలి , JSW & Jaiswaraajya.tv సంస్థల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వెంకటయ్య. ఈ దీనావస్థ కథ వెలుగులోకి రావడానికి కృషి చేసాడు JSW & jaiswaraajya సంస్థల కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్.